38,496 క్వింటాళ్లు ఉల్లి విక్ర‌యించాం

- ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

ఉల్లిగ‌డ్డ‌ల గురించి జ‌రుగుతున్న రాజ‌కీయాలు చూస్తుంటే బాధేస్తుంది. దేశంలోని ఏ రాష్ట్రంతో పోల్చినా త‌క్కువ ధ‌ర‌కు భారీ మొత్తంలో ఉల్లిని స‌బ్సిడీ ధ‌ర‌ల‌కు అందించిన ఘ‌న‌త మా ప్ర‌భుత్వానిది. దేశంలో వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నఉల్లి ధ‌ర‌లు ఒక‌సారి చూస్తే బీహార్ 35, తెలంగాణలో 40, వెస్ట్ బెంగాల్ 59, త‌మిళ‌నాడులో 40, మ‌ధ్య‌ప్ర‌దేశ్ 50ల‌కు కేజీ ఉల్లి విక్ర‌యిస్తున్నారు. ఒక్క ఏపీలో మాత్ర‌మే కేజీ ఉల్లి గడ్డ‌లు రూ. 25కే విక్ర‌యిస్తున్నాం. 
ఆయా రాష్ట్రాల్లో ఇప్ప‌టివ‌ర‌కు జరిగిన అమ్మ‌కాలు ప‌రిశీలిస్తే తెలంగాణలో ఒకే ఒక్క రైతు బ‌జార్‌లో 25 ట‌న్నులు, బీహార్లో న‌వంబ‌ర్ 22 నుంచి 28 వ‌ర‌కు జ‌రిగింది, త‌మిళ‌నాడు 50 ట‌న్నుల క‌న్నా త‌క్కువ, మ‌హారాష్ట్రలో ఇంకా మొద‌లు కాలేదు. మ‌నం మాత్రం 38,496 క్వింటాళ్లు విక్ర‌యించాం. భారత ప్ర‌భుత్వం  డిసెంబ‌ర్ 12న 2100 మెట్రిక్ ట‌న్నులు ఇంపోర్టు చేసుకుంటుంటే అందులో మ‌న రాష్ట్ర‌మే ఎక్కువ వాటా ఏపీదే కావ‌డం చూసైనా ప్ర‌తిప‌క్షం తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో రైతు బ‌జార్ల‌లో మాత్ర‌మే కాకుండా అన్ని మార్కెట్ యార్డుల్లో కూడా ఉల్లిని స‌బ్సిడీ ధ‌ర‌ల‌కు విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించాం. దానికి సంబంధించి అదికారుల‌తో కూడా మాట్లాడ‌టం జ‌రిగింది. 27 సెప్టెంట‌ర్ 19 నుంచి ధ‌ర‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని రైతు బజార్ల‌లో చౌక‌గా విక్ర‌యిస్తున్నాం. కాబ‌ట్టే అన్నిచోట్లా క్యూలు క‌నిపిస్తున్నాయి. హెరిటేజ్ లో 200ల‌కి ఇస్తున్నారు కాబ‌ట్టి ఎవ‌రూ ఉండ‌టం లేదు. 

Read Also: ఉల్లిపాయ‌లు కేజీ రూ.25కే అందిస్తున్నాం

తాజా వీడియోలు

Back to Top