ఉద్యోగులకు మేలు చేయాల‌నే ఔట్ సోర్సింగ్ కార్పొరేష‌న్‌

- ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

స‌భ‌లో ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడే వాళ్ల‌పై ప్రివిలైజ్ మోష‌న్ పెట్ట‌కుండా ఇంకో మార్గం క‌నిపించ‌డం లేదు. ఔట్‌సోర్సింగ్ పేరుతో ఉద్యోగుల శ్ర‌మ‌ను టీడీపీ ప్ర‌భుత్వం దోచుకుంది. ఉద్యోగం ద‌క్కాల‌న్నా లంచం, జీతం తీసుకోవాల‌న్నా లంచమే. దీనిపై ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. ఆఖ‌రికి ఆల‌యాల్లో క్లీనింగ్, శానిటీరీ ప‌నుల‌ను  ఔట్‌సోర్సింగ్ పేరుతో చంద్ర‌బాబు నాయుడు త‌న బంధువు భాస్క‌ర్ నాయుడు అనే వ్య‌క్తికి క‌ట్ట‌బెట్టాడు. త‌న‌కు సంబంధించిన వ్య‌క్తుల‌కు లాభం చేకూర్చి ఉద్యోగుల‌ను శ్ర‌మ‌ను నిలువునా దోచుకున్న ప‌రిస్థితులను మార్చాల‌ని, ఉద్యోగుల‌క ల‌బ్ధిజ‌రిగేలా చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఔట్ సోర్సింగ్ కార్పొరేష‌న్ ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల‌కు 50% రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని ఈ కార్పొరేష‌న్ ఏర్పాటు చేశాం. కానీ దీనిపై ప్ర‌తిప‌క్షం నీచ‌మైన ఆరోప‌ణ‌లు చేస్తోంది. ఇన్‌చార్జి మంత్రుల‌కు, డిపార్ట్‌మెంట్‌ల హెచ్ఓడీల‌కు దీనిని ప‌ర్య‌వేక్షించే బాధ్య‌త‌ను మాత్ర‌మే ఇచ్చాం త‌ప్ప నియామ‌కాల‌తో వారికి ఎలాంటి సంబంధం ఉండ‌దు. నిరుద్యోగుల‌కు మేలు జ‌రుగుతుంటే వీళ్లు ఓర్వ‌లేక‌పోతున్నారు. ఇలాంటి అచ్చెన్నాయుడి మీద మ‌రో ప్రివిలైజ్ మోష‌న్ మూవ్ చేస్తున్నాం. 
 

తాజా ఫోటోలు

Back to Top