ఏలూరు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

కాసేపట్లో తమ్మిలేరు రిటైనింగ్‌ వాల్‌ ప‌నుల‌కు శంకుస్థాపన

పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరు చేరుకున్నారు. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల ప్రారంభోత్స‌వాల నేప‌థ్యంలో హెలికాప్టర్‌లో ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంకు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌కు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, శ్రీరంగనాథరాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో తమ్మిలేరు కాల్వ రిటైనింగ్‌ వాల్‌కు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రూ.330 కోట్ల నిధులతో నగరంలో చేపట్టే పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. అనంతరం ఏలూరు నగరంలోని శ్రీసూర్య కన్వెన్షన్‌ హాల్‌లో ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, నూర్జహాన్‌ల కుమార్తె వివాహానికి హాజరవుతారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top