ఢిల్లీ చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

ఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన సీఎం కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ స్వాగతం పలికారు. సీఎం వెంట ఎంపీలు మిథున్‌రెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డి, బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా, జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, రైల్వే శాఖ మంత్రి గోయల్‌ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం వైయస్‌ జగన్‌ కలుసుకుంటారు. పోలవరం ప్రాజెక్టు పనులు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చిస్తారు. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top