ముచ్చింతల్‌ చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ముచ్చింతల్‌ చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, జూపల్లి రామేశ్వరరావు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో ముచ్చింతల్‌ శ్రీరామనగరంలోని సమతామూర్తిని దర్శించుకొని, శ్రీ రామానుజుల సహస్రాబ్ధి వేడుకల్లో సీఎం వైయస్‌ జగన్‌ పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వెంట మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top