మరకత రాజరాజేశ్వరీదేవిని దర్శించుకున్న సీఎం వైయస్‌ జగన్‌

దత్తపీఠాధిపతి స్వామి సచ్చిదానందను కలిసిన ముఖ్యమంత్రి

విజయవాడ: విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీగణపతి సచ్చిదానందసామి ఆశ్రమానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. ఆశ్రమ నిర్వాహకులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. ఆశ్రమంలోని శ్రీగణపతి దేవాలయాన్ని సందర్శించి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా శ్రీమరకత రాజరాజేశ్వరీ దేవిని దర్శించుకున్న సీఎం వైయస్‌ జగన్‌.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అవధూత దత్తపీఠాధిపతి స్వామి సచ్చిదానందని కలిసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వెంట టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top