గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.2 వేల సాయం

తాడేపల్లి: గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులు ఒక్కొక్కరికి రూ. 2 వేల చొప్పున ఆర్థికసాయం అందజేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సుమారు ఆరు వేల మంది మత్స్యకారులకు ఈ డబ్బు అందేలా అక్కడి అధికారులతో సంప్రదింపులు జరగాలని సీఎం సూచించారు. గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులకు భోజనం, వసతి సదుపాయాలు కల్పించాలని గుజరాత్‌ సీఎం విజయ్‌రూపానీకి ఫోన్‌ చేసి మాట్లాడానని, అక్కడి ప్రభుత్వం కొన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారికి తగిన వసతి, సదుపాయాలు అందేలా చూడాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top