ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో సీఎం ఏరియ‌ల్ స‌ర్వే

వ‌ర‌ద ముంపు ప్రాంతాల ప‌రిశీల‌న‌

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గోదావరి జిల్లాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. తాడేప‌ల్లి నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో బ‌య‌ల్దేరిన సీఎం.. ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత, స‌మాచార శాఖ మంత్రి పేర్నినాని ఉన్నారు. అంత‌కుముందు వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై గోదావ‌రి జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ఒక్కో ఇంటికి రూ.2 వేల ఆర్థిక సాయం అందించాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top