వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో సీఎం వైయ‌స్‌ జగన్‌ ఏరియల్‌ సర్వే 

చిత్తూరు: వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఏరియల్‌ సర్వే చేప‌ట్టారు. ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం వైయ‌స్‌ జగన్‌ పరిశీలించారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైయ‌స్ జగన్‌ అధికారులతో కలిసి ఏరియల్‌ సర్వే నిర్వహించి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.  ఏరియల్ సర్వే అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో స్టాల్‌ను ప‌రిశీలించారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముంపు బాధితులను ఆదుకునే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అధికారుల‌ను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.రెండు వేల చొప్పున ఇవ్వాలని, ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని సూచించారు. అలాగే.. భారీ వర్షాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు వీలైనంత త్వరగా రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందిగా ఆయన సూచించారు. బాధితులను ఆదుకోవడంలో మొక్కుబడిగా కాకుండా మానవతా ధృక్పథంతో వ్యవహరించాలన్నారు.    

తాజా ఫోటోలు

Back to Top