ఏరియల్‌ సర్వేకు బయల్దేరిన సీఎం వైయ‌స్‌ జగన్‌

 అమరావతి: నివర్‌ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ పర్యటనకు బయలుదేరారు. శనివారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరిన ఏపీ సీఎం గన్నవరం విమానశ్రయం నుంచి నేరుగా చిత్తూరు జిల్లాకు వెళ్లనున్నారు. అక్కడ నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైయ‌స్సార్‌, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం సీఎం తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top