రైతు అనే వ్యక్తి నష్టపోతే.. అందరూ నష్టపోతారు

వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ – సన్నద్దత, రబీ పంటల సాగుపై సీఎం వైయ‌స్‌ జగన్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: రైతు అనే వ్యక్తి నష్టపోతే అందరూ నష్టపోతారని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.  క‌లెక్ట‌ర్లు ఈ విష‌యాన్ని ప్రాముఖ్యంగా గుర్తించాల‌ని ఆదేశించారు. మంగళవారం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ – సన్నద్దత, రబీ పంటల సాగుపై ప్రణాళిక, వ్యవసాయ సలహా కమిటీల సమావేశాల నిర్వహణపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్‌ పంట చేతికొస్తుంది కాబట్టి, అక్టోబర్‌ 15 నుంచి ధ్యాస పెట్టాలని సీఎం వైయ‌స్‌ జగన్‌ తెలిపారు. ఆర్‌బీకేల ద్వారా మన ప్రొక్యూర్‌మెంట్‌ మరింత ఎఫెక్టివ్‌గా పనిచేయాలని, ఈ క్రాపింగ్‌ ప్రతీ పంటకు కంప్లీట్‌ కావాలన్నారు. ఈ క్రాపింగ్‌ ఎక్కడా కూడా పెండింగ్‌ ఉండకూడదని, దీనిపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఈ క్రాపింగ్‌ తర్వాత రైతుల రిజిస్ట్రేషన్‌ జరగాలి, తర్వాత లిస్ట్‌ ఆర్‌బీకేలలో పెట్టాలి. ప్రతీ రైతు వివరాలు ఈ క్రాపింగ్‌లో పక్కాగా ఉండాలి. సోషల్‌ ఆడిట్‌ చేయాలి. మిస్‌ అయితే వెంటనే నమోదుచేయాలి. ఫామ్‌గేట్‌ అనేది ప్రతీ పంటకూ చేయాలి. కూపన్లు ఇచ్చి ఫలానా రోజు ప్రొక్యూర్‌ చేస్తామని చెప్పాలి. ఎక్కడా కూడా మ్యాన్యువల్‌ సర్టిఫికెట్‌ ఉండకూడదు, ఈ క్రాపింగ్‌ తప్పనిసరిగా జరగాలి. సీఎం యాప్‌ ద్వారా మానిటరింగ్‌ జరగాలి. అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ వెంటనే అలర్ట్‌ చేయాలి. జేసీలు వెంటనే రైతుకు మార్కెటింగ్‌ సౌకర్యం చూపాలి. ఏ పంటకు ఎంత గిట్టుబాటు ధర అనేది అక్టోబర్‌ 1 న రిలీజ్‌ చేస్తాం.. అక్టోబర్‌ 5 కల్లా అన్ని ఆర్‌బికేలలో డిస్‌ప్లే చేయాలి. కనీస గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ రేట్‌కు మనం అమ్మించగలగాలి. రైతుకు పూర్తిగా తోడు నిలబడే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్లు, జేసీలు పూర్తిగా ధ్యాస పెట్టండి. స్టేట్‌లెవల్‌ అడ్వైజరీ కమిటీ, జిల్లా, మండల, ఆర్‌బీకేల స్ధాయి కమిటీలు వెంటనే ఏర్పాటుచేయాలి. ఏ పంట గ్రామంలో వేయాలి, ఏ పంట వేయద్దు అనే అంశాలు కూడా కమిటీలు చర్చించాలని, కలెక్టర్లు అందరూ గుర్తుపెట్టుకోవాలి, రైతు అనే వ్యక్తి నష్టపోతే అందరూ నష్టపోతారు. ఫార్మర్స్‌ ఈజ్‌  హయ్యెస్ట్‌ ప్రయారిటీగా తీసుకోవాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూచించారు. 
 

తాజా వీడియోలు

Back to Top