తాడేపల్లి: కష్టజీవులకు తోడుగా ఉండేందుకు జగనన్న చేదోడు పథకానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కష్టజీవులను పట్టించుకోకపోతే ఈ వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. రాష్ట్రంలో రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం వరుసగా రెండో ఏడాది ‘జగనన్న చేదోడు’ పథకం కింద రూ. 285.35 కోట్ల నగదు విడుదల చేశారు. 2,85,350 మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 285.35 కోట్ల నగదును సీఎం వైయస్ జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే
ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది ఎంత మంచి కార్యక్రమం అంటే స్వయం ఉపాధి కార్యక్రమంలో అత్యంత ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న రంగం ఇది. దాదాపుగా 2.85 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడ్డారు. ఇటువంటి చేతివృత్తులు చేసుకుంటూ..బతకలేని పరిస్థితికి నెట్టివేయబడే పరిస్థితి వస్తే వ్యవస్థనే కుప్పకూలుతుంది. వీరందరికీ తోడుగా నిలిచేందుకు, మంచి చేసేందుకు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. అదృష్టంగా కూడా భావిస్తున్నాను. తాము వివక్షకు గురైనా కూడా మన సామాజంలో ఇంటింటికీ వందలు, వేల సంవత్సరాలుగా అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. నిజంగా వృత్తిపరంగా రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలు..సేవలందిస్తున్న షాపులు ఉన్న అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ.10 వేల చొప్పున, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు, తోడుగా ఉండేందుకు ఆర్థిక సాయం చేస్తున్నాం. వరుసగా రెండో ఏడాది వీరికి తోడుగా నిలబడ్డాం. 2,85,350 మంది కుటుంబాలకు తోడుగా నిలిచేందుకు అక్షరాల రూ.285 కోట్ల 35 లక్షలు నేరుగా వాళ్ల అకౌంట్లలో జమ చేస్తున్నాం. షాపులున్నా 1,46103 మంది టైలర్లకు రూ. 146 కోట్ల 10 లక్షలు, షాపులున్న 98,439 మంది రజక సోదరులకు రూ.98 కోట్ల 44 లక్షలు ఈ రోజు బటన్ నొక్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. షాపులున్న 40880 మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40 కోట్ల 81 లక్షలు ఈ రోజు వాళ్ల అకౌంట్లలో జమ చేస్తున్నాం.
వీరంతా కూడా కష్టజీవులు అని చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా పండగ చేసుకునే సమయంలో కూడా వీరు తమ కుటుంబాల్లో పండుగలో ఉండకుండా మంచి చేసే పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఇటువంటి శ్రమకు తగిన ఆదాయం లేని సమయంలో..స్వయం ఉపాధిలో 285 లక్షల మంది ఆధారపడి బతుకుతున్నారు. వీరికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని నా పాదయాత్రలో ప్రతి సందర్భంలోనూ గమనించా. వీరి కష్టాలు విన్నప్పుడు మంచి చేయాలని తపన, తాపత్రయంతో అధికారంలోకి వచ్చిన తరువాత జగనన్న చేదోడు కార్యక్రమాన్ని తీసుకువచ్చాను.
ఎక్కడా లంచాలకు, వివక్షకు తావులేకుండా, ఎవరి చుట్టూ కూడా తిరగాల్సిన అవసరం లేకుండా, అత్యంత పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద డిస్ప్లే బోర్డుల్లో అర్హుల జాబితాను ప్రదర్శిస్తున్నాం. సోషల్ఆడిట్ కూడా నిర్వహిస్తున్నాం. ఇంకా ఎవరైనా మిస్ అయితే దరఖాస్తు చేసుకోవాలని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా చేస్తున్నాం. ఇది రెండో విడతగా సహయం చేస్తున్నాం. రెండేళ్లలో వీరికి రూ.583 కోట్లు ఇవ్వగలిగామని సగర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తున్నాం.
ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లు ఇస్తున్నామని చెప్పి, ఏ కొందరికో ఇచ్చి..అందులో కూడా కమీషన్లు కొట్టేశారు. వాటిలో కూడా నాణ్యతలేని సామగ్రిని ఇచ్చే పరిస్థితిని గత ప్రభుత్వంలో చూశాం. వీళ్లు బీసీలకు మంచి చేస్తున్నామని మాటల్లో చెప్పడమే కానీ, వారికి అత్యంత గొప్పగా చేసే మంచి కార్యక్రమం ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని నీరుగార్చారు. గత ప్రభుత్వం అన్ని చెడు చేసి గొప్ప సామాజిక న్యాయం చేశామని చెప్పింది. కానీ మన ప్రభుత్వం మనసుతో వారందరికీ కూడా నిజమైన చేదోడు అందిస్తున్న మన ప్రభుత్వానికి , వాళ్ల ప్రభుత్వానికి తేడా ఎంత ఉందో ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుతున్నా..
బీసీలంటే కేవలం పని ముట్లు కాదు..బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు..సమాజానికి బ్యాక్ బోన్ క్లాస్ అని నిండు మనసుతో నమ్మాం. అధికారంలోకి వచ్చిన తరువాత ఆచరించామని సగర్వంగా చెబుతున్నాను. ఈ వృత్తివర్గాల జీవితాల్లో మెరుగైన మార్పు రావాలని, మిగతా ప్రపంచంతో పోటిపడి ఎదగాలని, అందుకు అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేయాలని మనసా, వాచా,ఖర్మన తపించాం. అందుకే మత్స్యకార భరోసా, నేతన్న నేస్తంతో పాటు నవరత్నాలతో ప్రతి ఒక్క పథకాన్ని కూడా బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనారిటీలకు అత్యంత పెద్ద పీట వేశాను. వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ సున్నా వడ్డీ, వైయస్ఆర్ రైతు భరోసా, వైయస్ఆర్ పెన్షన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసనతి దీవెన, వైయస్ఆర్ వాహన మిత్ర ఇలా ఏ పథకం తీసుకున్నా..ఇవేకాకుండా ఇంగ్లీష్ మీడియం చదువులు, 30 లక్షల కుటుంబాలకు మేలు చేస్తూ ఇళ్ల పట్టాల పంపిణీ. ఎన్నికల ముందు ఏలూరులో నేను ఇచ్చిన మాట ప్రకారం వారిని వెన్నెముక కులాలుగా మార్చేందుకు నిండుమనసుతోనే ఈ రెండున్నర సంవత్సరాలు గట్టిగా ప్రయత్నం చేశానని తెలియజేస్తున్నాం.
దేవుడి చల్లని దీవెనలతో ఈ రెండున్నరేళ్ల పాలనలో కొన్ని పనులు ఏం చేశామో అన్నద కూడా ఈ సందర్భంగా కాస్త జ్ఞాపకం చేసుకుంటే..
- బీసీ కమిషన్‌ను శాశ్వత ప్రతిపాదిక మీద నియమించాం.మొట్ట మొదటి రాష్ట్రం మనదే.
- క్యాబినెట్ కూర్పులోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 60 శాతం మంత్రి పదవులు ఇచ్చిన ప్రభుత్వం మనదని సగర్వంగా తెలియజేస్తున్నా..
- ఐదుగురు డిప్యూటీ సీఎంల్లో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. శాసన సభ స్పీకర్ పదవిని కూడా బీసీలకే ఇచ్చామని సగర్వంగా చెబుతున్నా
- మనం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన 32 ఎమ్మెల్సీల్లో ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 18 పదవులు ఇచ్చాం.
- నలుగురు సభ్యులను రాజ్యసభకు పంపిస్తే అందులో సగం అంటే రెండు ఎంపీ స్థానాలు బీసీలకే ఇచ్చాం
- మొత్తం 650 మండలాల్లో వైయస్ఆర్సీపీ గెలుచుకున్నది 636 మండలాలు గెలిచాం. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 427 అధ్యక్ష పదవులు ఇచ్చాం. అంటే 67 శాతం వీరికే ఇచ్చాం.
- 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 9 పదవులు ఇచ్చాం. అంటే 69 శాతం వీరికే ఇచ్చాం.
- 13 నగర కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో వీరికే 12 పదవులు ఇచ్చాం. అంటే 92 శాతం ఈ వర్గాలకే ఇచ్చాం
- మొత్తం 87 మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ జరిపితే అందులో 84 స్థానాలు మన పార్టీ గెలుచుకుంది. ఇందులో 61 చైర్మన్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చాం.
- మొత్తం 196 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉంటే..ఇందులో ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీలకు 118 పదవులు ఇచ్చాం.
- నామినేటెడ్ కింద 137 కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో 79 పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే వర్గాలకే ఇచ్చాం. అంటే 58 శాతం వీరికే ఇచ్చాం
- మొత్తం 484 నామినేటెడ్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేస్తే ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 281 పోస్టులు ఇచ్చాం. 58 శాతం ఈ వ ర్గాలకే ఇచ్చాం.
- ఈ మధ్య కాలంలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో మనం ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు 1.24 లక్షలు ఉంటే..ఇందులో 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చాం.
- నామినేటెడ్ పదవులు, పనుల్లో దేశంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టాన్ని చేసింది మన ప్రభుత్వమే.
ఒకవైపు మనం ఇంత మంచి చేశామని తెలియజేసే పరిస్థితి ఉంటే..మరో వంక ఎస్సీ కులాల్లో పుట్టాలని కోరుకుంటారా అన్న చంద్రబాబు రామోజీరావుకు ఈ రోజు ముద్దుబిడ్డగా ఉన్నారు. బీసీల తోకలు కత్తరిస్తామన్న చంద్రబాబుకు ఏబీఎన్, ఈటీవీ, టీవీ5లు ఉన్నాయి. బీసీలు జడ్జీ పదవులకు పనిరారని లేఖలు రాసిన వ్యక్తి ఈ రోజు మన ఎర్రజెండా వారికి ఆత్మీయ కామ్రెడ్‌గా మారాడు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా బాబు బినామీల రియల్ ఎస్టేట్ ధరల కోసం ఈ రోజు కామ్రెడ్ సోదరులు జెండాలు పట్టుకుంటున్నారు. ఎవరైనా కూడా అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వడం కోసం స్థలాలు కేటాయిస్తే..డెమెగ్రఫీ ఇన్‌బ్యాలెన్స్ దెబ్బతింటుందని ఏకంగా కోర్టుకు వెళ్లి పిటిషన్లు వేసిన చంద్రబాబుకు మద్దతు పలుకుతున్న మహానుబావులుగా మన కామ్రెడ్లు కనిపిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె ప్రారంభించాలని ఎవరూ కోరుకోరూ..ప్రజలు, ప్రభుత్వం కోరుకోరు. ఉద్యోగులు కూడా కోరుకోరు. ఇంతగా ప్రేమించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటî లు కోరుకోరు. ఈ రెండున్నరేళ్ల పాలనలో డీబీటీ ద్వారా రూ.1.27 లక్షల కోట్లు అందుకున్న ఏ కుటుంబం కోరుకోదు. ఏ ఒక్క సామాజిక వర్గం కోరుకోదు. కోరుకునేది ఎవరో తెలుసా..ఆందోళనలు ఎవరి కావాలో తెలుసా..చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ, కడుపు మంట ఉన్న వారికే కావాలి. ఎర్రజెండాలకు కావాలి. బాబు దత్తపుత్రుడికి కావాలి. వ్యక్తుల పరంగా మీడియా ముసుగులో నడుపుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5కి కావాలి. కాబట్టే ఉద్యోగులు సమ్మె జరుగుతుందంటే వీళ్లకు పండగ. సంది జరిగింది. ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం లేదంటే వీరికి నచ్చడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె విరమించగానే కమ్యూనిస్టులు కొందరిని ముందుకు తోశారు. ఎదర ఎర్రజెండా..వెనుక పచ్చ ఎజెండా..ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. నిజంగా ఈ రోజు ఈనాడు మొదటి పేజీ చూస్తే..ఆశలు రోడ్డుపైకి వచ్చారంటారు. వాళ్లను ఈడ్చుతున్నట్లు ఫొటోలు వేశారు. ఆశ అక్కచెల్లెమ్మల మీద ఈనాడుకు ఇంత ప్రేమ ఉందని చూపే అభూత కల్పన, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారని ఈనాడు గుండెలు బాధుకుంటోంది. వెనుక నుంచి కమ్యూనిస్టుల ప్రోద్భలం, వెనుకనుంచి పచ్చ జెండా ఎజెండా..ఎవరో ఒకరు. ఏదో ఒక చోట ఆందోళన చేయండి. మీకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయండి, మా బాబు పాలనే బాగుందని చెప్పండి..మీకు మెరుగైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాలుగు జెండాలు పట్టుకొని అరవండి. ముఖ్యమంత్రిని తిడితే బాగా కవరేజ్ చేస్తామని, సోషల్ మీడియాలో ఎవరైనా రాస్తే దాన్ని ప్రధాన వార్తగా ప్రచురిస్తాం. టీవీల్లో చూపిస్తాం..ఇది ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఎల్లో మీడియా దోరణి, నిజంగా ఇవి వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు చాలా బాధనిపిస్తుంది. వీళ్ల పరిస్థితి చూసి బాధలో నుంచి నిజంగా నవ్వు కూడా వస్తుంది. ఈ స్థాయికి వీళ్లు దిగజారిపోయేలా దేవుడు నన్ను హెచ్చించాడని నిజంగా సంతోషంగా కూడా ఉంది.
కొన్ని విషయాలు మీ ద్వారా రాష్ట్రంలోని ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 3.97 లక్షల మంది ఉన్నారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో మన ప్రభుత్వంవచ్చిన తరువాత మన కళ్లెదుటే 1.24 లక్షల మంది కనిపిస్తున్నారు. మన కళ్లేదుటే ఆర్టీసీలో 51 వేల మందిని ప్రభుత్వంలో వీలినం చేశాం. అన్ని కలిపితే మన ప్రభుత్వం వచ్చిన తరువాత 1,84,264 కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఏకంగా 50 శాతం పైచిలుకు ఉద్యోగుల శాతం పెరిగింది ఈ ఎల్లోమీడియాకు, ఈ పార్టీలకు కనిపించడం లేదా?
ఈ రోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఎక్కడా కూడా మోసపోకూడదు. లంచాలు ఇచ్చే పరిస్థితి రాకూడదు. దళారీల పాలు కాకూడదు. కమీషన్లు లేకుండా మంచి, మెరుగైన జీతాలు ఇవ్వాలని అబ్కాస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి లక్ష మందికి పైగా ఈపీఎఫ్, ఈఎస్ఐ సేవలు అందిస్తున్నాం.
ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడంతో రాష్ట్ర ఖజానా మీద ఈ రోజు అక్షరాల ఏడాదికి రూ.3600 కోట్లు భారం పడుతోంది. చిరునవ్వుతో తీసుకుంటున్న ప్రభుత్వం మనది కాదా? పక్క రాష్ట్రాల్లో ఆర్టీసీ ఉద్యోగులు రొడ్డెక్కి పోరాటాలు చేస్తున్నారు. ఒక్క ప్రభుత్వమైనా పట్టించుకుందా?
కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ ఇస్తామని ఆశ చూపారే తప్ప..ఒక్కరికైనా చేశారా? మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేస్తున్నాం.
2019 ఎన్నికలకు మూడు నెలలకు ముందు ఏ ఉద్యోగాలకు ఎంతెంత జీతం ఇచ్చారో? ఇప్పుడు మన ప్రభుత్వం ఎంతెంత జీతం ఇస్తుందో వారికి, ప్రజలకు తెలుసు. అయినా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా..
- అంగన్వాడీ వర్కర్లకు గతంలో రూ.7 వేలు ఇస్తే..మన ప్రభుత్వం రూ.11,500 ఇస్తున్నాం, అంగన్వాడీ మినీ వర్కర్లకు గతంలో రూ.4,500 ఇస్తే మనం వచ్చిన తరువాత రూ.7 వేలకు పెంచాం.
- సంఘ మిత్ర, యానిమేటర్లకు బాబు హయాంలో రూ.3 వేలు ఇస్తే మనం రూ.10 వేలకు పెంచాం.
- మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులకు గతంలో రూ.12 వేలు ఇస్తే..మన ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.18 వేలకు పెంచాం
- ఆశ వర్కర్లకు గతంలో రూ.3000 ఇస్తే..మనం ఇవాళ రూ.10 వేలు ఇస్తున్నాం.
- గిరిజన సంక్షేమ హెల్త్ వర్కర్లకు బాబు హయాంలో కేవలం రూ.400 ఇచ్చేవారు. ఇవాళ మనం రూ.4000 ఇస్తున్నాం.
- హోం గార్డులకు గతంలో రూ.18 వేలు ఇస్తే..మనం రూ.21,300 ఇస్తున్నాం.
- 108 వాహనం వ్యవస్థలోని డ్రైవర్లకు నెలకు రూ.14 వేలు అయితే, ఇవాళ రూ.28 వేలు ఇస్తున్నాం.
- ఇలా దాదాపుగా 3.80 లక్షల మందికి మన ప్రభుత్వం రాకముందు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.1198 కోట్లు అయితే ఈ రోజు మన ప్రభుత్వం భరిస్తున్న ఖర్చు రూ.3187 కోట్లు. ఎక్కడ బాబు హయాంలో రూ.1197 కోట్లు, మీ బిడ్డ హయాంలో 3187 కోట్లు ఇస్తున్నాం. రాజకీయాలను కల్ముషం చేసి రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది.
ఈ రోజు ఉద్యోగుల సమస్యలు సమరస్యపూర్వకంగా పరిష్కారం అయ్యాయి. ఆ ఉద్యమంలో భాగస్వాములైన కొన్ని లెప్ట్ పార్టీల యూనియన్లు చర్చల సమయంలో సంతకాలు పెట్టి సంతోషం వ్యక్తం చేశారు. బయటకు వచ్చి కొన్ని యూనియన్లు పోరుబాట పడుతామని, రోడ్లు ఎక్కుతామని కొంత మంది అంటున్నారు. బాధనిపిస్తోంది. కోవిడ్ వల్ల మన పిల్లలకు రెండేళ్లు పరీక్షలు పెట్టలేదు. ఇలాంటి సమయాల్లో ఇలా కొంత మంది కేవలం ప్రభుత్వంపై రెచ్చగొట్టాలని రొడ్డెక్కితే ఆ పిల్లల చదువులు ఏం కావాలి. ఆ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతాం. పిల్లలకు పరీక్షలు పెట్టకుండా గాలికి వదిలేస్తే వారి భవిష్యత్ ఏమవుతుంది. రెచ్చగొట్టే నాయకులు, ఎల్లోమీడియా నిజంగా వీళ్లు మనుషులేనా? ధర్మమేనా అని ఆలోచన చేయాలి. ఇన్ని మంచి చేస్తున్నా కూడా ఈ రోజు బురద జల్లడం పరిపాటిగా మారింది.
దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఇంకా మంచి చేసే ప్రయత్నం చేస్తాడు. ఇంకా మంచి చేసేలా దేవుడు బలాన్ని ఇవ్వాలని, మీ అందరి చల్లని దీవెనలు కావాలని ఆశిస్తూ..కాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా...