ఉప్పునీటిని మంచినీరుగా మార్చే ప్రక్రియను పరిశీలించిన సీఎం 

  
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదివారం ఇజ్రాయోల్‌లోని హదెరా నీటిశుద్ధి ప్లాంట్‌ను సందర్శించారు. ఉప్పునీటిని మంచినీరుగా మార్చే ప్రక్రియ గురించి ఈ సందర్భంగా ప్లాంట్‌ అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు. ప్రాజెక్టు వ్యయం, నిర్వహణా వ్యయాల గురించి సీఎం అక్కడి అధికారులను ఆరా తీశారు. ప్లాంట్‌లో వివిధ విభాగాలను పరిశీలించిన సీఎం ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియలో పలు దశల గురించి అడిగి తెలుసుకున్నారు. యంత్రాల పనితీరును పరిశీలించి ప్లాంట్‌లో మంచినీటిని రుచి చూసిన ముఖ్యమంత్రి నీటి నాణ్యత మెరుగ్గా ఉందని ప్రశంసించారు. టెల్‌అవీవ్‌లో బారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్‌ సీఎం వెంట ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  
 

Back to Top