23న సీఎం ప‌ర్య‌ట‌న‌ను విజయవంతం చేద్దాం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్రసాదరావు

 న‌ర‌స‌న్న‌పేట‌లో స‌న్నాహ‌క స‌మావేశం 

 న‌ర‌స‌న్న‌పేట : ఈ నెల 23న చేప‌ట్ట‌బోయే సీఎం ప‌ర్య‌ట‌న‌ను  విజయవంతం చేయాలని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పిలుపు ఇచ్చారు. సీఎం రాక దృష్ట్యా న‌ర‌స‌న్న‌పేటలో  స‌న్నాహ‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి ఆదేశాను సారం ఎక్కువ గ్రామాల‌లో రెవెన్యూ స‌ర్వే పూర్తి అయిన నియోజ‌క‌వ‌ర్గం న‌ర‌స‌న్న‌పేటేన‌ని అందుకే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశామ‌ని అన్నారు. కృష్ణ దాసు నేతృత్వాన ఆయ‌న రెవెన్యూ శాఖ‌ను నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలోనే భూ స‌ర్వే ను వీలున్నంత వ‌ర‌కూ వేగ‌వంతం చేయించార‌న్నారు. సీఎం కార్య‌క్ర‌మం అన్న‌ది ల్యాండ్ టైటిల్ కు సంబంధించినది క‌నుక భూ స‌ర్వే ప్రాధాన్యం, త‌దిత‌ర విష‌యాల‌పై సీఎం మాట్లాడ‌తారు.  ప‌న్నెండు వేల మందితో రైతుల‌తో ఈ స‌భ‌ను నిర్వ‌హించాల‌ని ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు సంబంధించి బ‌స్సు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు స్థానిక నాయ‌కుల‌కు బాధ్య‌త అప్ప‌గించాలి. మొత్తం ప్రొగ్రాం గంట‌న్న‌రలో అయిపోతుంది క‌నుక  రైతులు అంతా ఇక్క‌డికి వ‌చ్చి ఆద్యంతంఉండి వెళ్లాల‌న్నారు. సీఎం రాక నేప‌థ్యంలో జ‌మ్ము (హెలీప్యాడ్ ఏర్పాటు చేసిన ప్ర‌దేశం) నుంచి న‌ర‌స‌న్న‌పేట జూనియ‌ర్ కాలేజీ (స‌భా ప్రాంగ‌ణం) వ‌ర‌కూ సీఎంకు స్వాగ‌తం చెప్పే విధంగా ఉంటే ఇంకా బాగుంటుంద‌ని అన్నారు.

 ఆయ‌న మాట్లాడుతూ.. "భూ హ‌క్కు భూ ర‌క్ష అన్న‌ది ఈ ప‌థ‌కం పేరు క‌నుక ఈ రెండింటిపై ఈ రాష్ట్రంలో జ‌రుగుతోంది. గ‌తంలో బ్రిటిష‌ర్ల కాలంలో జ‌రిగింది. 1890లో ,1920లో వేర్వేరు సంద‌ర్భాల్లో భూ స‌ర్వే జ‌రిగింది. త‌రువాత  కాలంలో ఇప్పుడు భూ స‌ర్వే చేస్తున్నాం. క‌నుక ఈ స‌ర్వేను అంతా వినియోగించుకోవాలి. అదేవిధంగా గ్రామంలో ఉండే అశాంతికి కార‌ణం అయిన భూ త‌గాదాలు చాలా వ‌ర‌కూ భూ స‌ర్వే పూర్తితో తీరిపోతాయి. క‌నుక వీటిపై అంద‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించాలి. భూ సర్వే పూర్తయితే కోర్టు త‌గాదాలు అన్న‌వి కూడా పూర్తిగా ప‌రిష్కారం అవుతాయి. ఏ విధంగా చూసుకున్నా రైతుకు ఎంతో మేలు చేసే ప‌ని ఇది. ఓ విధంగా భూమికి సంబంధించి హ‌ద్దులు తేల‌క‌పోతే సంబంధిత ప‌త్రాలు అన్న‌వి వివాదాల్లో ఇరుక్కుపోతే బ్యాంకుల నుంచి రుణాలు అన్న‌వి రావు. అదేవిధంగా చాలా వ‌ర‌కూ పెట్టుబ‌డులు అన్న‌వి ఆగిపోతాయి. అందుకే ఏ వివాదం లేని టైటిల్ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. దీని వ‌ల్ల  ప్ర‌జ‌ల  జీవ‌న ప్ర‌మాణాలు పెరుగుతాయి. వివాదాల్లో లేని భూమి కార‌ణంగా ఓ రైతు ప్ర‌శాంతంగా ఉండ‌గ‌ల‌డు. 

సులువుగా ఈ భూమి నాది అని ఓ బ‌ల‌హీనుడు చెప్ప‌లేకపోతే అది కాస్త ధ‌నవంతుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. సులువుగానే బీద‌వాడి చేతికి భూ హ‌క్కు ప‌త్రాలు అందించే ప్ర‌క్రియ చేప‌ట్టాలి. త‌న భూమి ఇది అని నిరూపించుకునే విధంగా చేయ‌గ‌ల‌గాలి. అందుకే భూ హ‌క్కు..భూ ర‌క్ష ప‌థ‌కంలో అన్నీ స‌మ‌కూరుతాయి. వీటికి అనుసంధానంగా మ‌రికొన్ని ప‌నులు చేప‌డుతున్నాం. రానున్న కాలంలో సచివాలయం కార్యాల‌య‌మే రిజిస్ట్రేష‌న్ ఆఫీసుగా మారనుంది. అందుకు అనుగుణంగా పాల‌న‌లోనూ మ‌రిన్ని మార్పులు చేప‌ట్ట‌నున్నాం.  ముందున్న కాలంలో టైటిలింగ్ యాక్ట్ ను తీసుకుని రానున్నాం. నీతి అయోగ్ తీసుకుని వ‌చ్చిన ఓ చ‌ట్టంను మోడ‌ల్ గా తీసుకుని దీనిని రూపొందించ‌నున్నాం. ఒక‌వేళ ఈ చ‌ట్టం అమల్లోకి వ‌స్తే రెవెన్యూ చెప్పేదే కోర్టు కూడా ఒప్పుకునేందుకు వీలుంటుంది. సివిల్ కోర్టు అధికారాల‌ను రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోనుంది. పెద్ద ఎత్తున రెవెన్యూ సంస్క‌ర‌ణ‌లు తీసుకుని వ‌చ్చే విధంగా రేప‌టి వేళ సీఎం కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఇవి అంద‌రికీ అర్థం కావాలి."అని చెప్పారాయ‌న.

కార్యక్రమంలో ఇంచార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్, ఎంపీ బెల్లన చంద్ర శేఖర్, జెడ్పి చైర్మన్ పిరియా విజయ, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్ కుమార్, ఎంఎల్సీ పాలవలస విక్రాంత్, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top