సీఎం పెద్ద మ‌న‌సు.. ఆ బోటు య‌జ‌మానికి రూ.25 ల‌క్ష‌ల సాయం

కాకినాడ: గంగపుత్రులపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. గత డిసెంబర్‌ 1న బైరవపాలెం వద్ద నడి సముద్రంలో బోటు దగ్ధమవ్వగా, బోటులో చిక్కుకున్న ఆరుగురు మత్స్యకారులను కోస్ట్‌ గార్డ్‌ బృందం రక్షించింది. వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ విషయాన్ని సీఎం వైయ‌స్‌ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం వైయ‌స్‌ జగన్‌.. బోటు యజమాని కాటాడి రామకృష్ణ పరమహంసకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.25 లక్షల ఆర్థిక సహాయం విడుద‌ల చేశారు. ఈ మేర‌కు ఆర్థికసాయం చెక్కును ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌రెడ్డి రామ‌కృష్ణ కుటుంబానికి అందించారు.

Back to Top