సీఎం ప‌ద‌విని వ్యాపారంగా మార్చేశారు..

చంద్ర‌బాబుపై వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కేరోజా ధ్వ‌జం...

చిత్తూరు: ఎన్నికల్లో ఓటర్లను కొనేందుకు చంద్రబాబు కొత్త అవతారం ఎత్తారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. రూ.1000 పెన్షన్‌ ఇవ్వడానికి అష్టకష్టాు పడుతున్న చంద్రబాబు రూ.2మే ఇస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. అరకొర డబ్బు ఇచ్చి టీడీపీకి ఓట్లు వేయ్యాని చంద్రబాబు ప్రమాణం చేయిస్తున్నారంటే చంద్రబాబు దిగజారుడుతనాన్ని అందరూ గమనిస్తున్నారన్నారు. సీఎం పదవిని చంద్రబాబు వ్యాపారంగా మార్చేశారని మండిపడ్డారు. పథకాలను అరకొరగా అమలు చేసి టీడీపీకే ఓటు వెయ్యాలని ప్రమాణం చేయిస్తున్నారంటే ఆయన ఎంత దిగజారిపోయారో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. సీఎం పదవిని చంద్రబాబు వ్యాపారంగా మార్చివేశారని, పసుపు కుంకుమలను తుడిచే విధంగా పాలన చేస్తున్నారని రోజా మండిపడ్డారు. ప్రజలకు నీళ్లు మాత్రం ఇవ్వలేకపోరని.. మద్యం మాత్రం ఆర్డర్‌ వేస్తే వచ్చేస్తోందని చెప్పారు. పసుపు కుంకుమకి పదివేలు ఇస్తామని చెప్పి.. మూడువేలు చెక్కులు ఇవ్వడానికి చంద్రబాబుకు సిగ్గులేదా అని ఘాటుగా ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి సభలో ప్రధాని మోదీతో సహా, చంద్రబాబు, పవన్‌ కళ్యాన్‌ చెప్పినట్లు ఆమె గుర్తుచేశారు. ప్యాకేజీ కోసం చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని, వైఎస్‌ జగన్‌ కారణంగా హోదా పోరాటం ఇంకా కొనసాగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు నిజంగా హోదాపై చిత్తశుద్ధి ఉంటే మోదీ ఎదుటనిరసన వ్యక్తం చేయాలని సవాలు చేశారు. డ్వాక్రా మహిళల రుణాలు, రైతులరుణాల మాఫీ చేసిన తరువాతనే టీడీపీ ఎన్నికలకు వెళ్లాలని రోజా డిమాండ్‌ చేశారు. 

Back to Top