క్షేత్రస్థాయి సైనికులను కలుసుకోవడం ఆనందదాయకం

సీఎం వైయ‌స్ జగన్‌ ట్వీట్‌

అమరావతి: సచివాలయాల్లోని ప్రతి ఇంటిని అవిశ్రాంతంగా సందర్శించి.. రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి సందేశాన్ని ప్రతి గడపకూ తీసుకెళ్లిన తమ సైనికుల్లో కొందరిని కలుసుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సచివాలయ కన్వీనర్లు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం తనను కలిసిన వారి ఫొటోలను జత చేసి సీఎం వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. అంకితభావంతో పనిచేసే క్షేత్ర స్థాయి సైనికులను కలుసుకోవడం పట్ల ఆనందంగా ఉందని తెలిపారు.  వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ కుటుంబానికి ఇది గర్వకారణమన్నారు. 

Back to Top