సెప్టెంబర్‌ 1, 2 తేదీలలో వైయ‌స్ఆర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు  సీఎం వైయ‌స్ జగన్ 

 వైయ‌స్ఆర్ జిల్లా: సెప్టెంబర్‌ 1, 2 తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయ‌స్ఆర్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఇడుపులపాయకు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.విజయరామరాజు పేర్కొన్నారు.  ఇడుపులపాయలోని వైయ‌స్సార్‌ ఘాట్, గెస్ట్‌ హౌస్, నెమళ్ల పార్కు తదితర ప్రాంతాలను ఆయన జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, పులివెందుల ఆర్డీఓ వెంకటేశులు, జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిర్ణయించిన మేరకే అధికారులను, ప్రజాప్రతినిధులను అనుమతించాలన్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సీఎం పర్యటనను విజయవంతం చేయాలని తెలిపారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top