మీ అందరికీ ఆల్‌ ద బెస్ట్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అమరావతి : రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగ నియామకాలకు సంబంధించిన రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. గ్రామ సచివాలయాల్లో 95,088 ఉద్యోగాలు, పట్టణ వార్డు సచివాలయాల్లో 31,640 ఉద్యోగాలు భర్తీకి సన్నాహకాలు జరుగుతున్నాయి. సెప్టెంబరు ఒకటవ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగార్థులకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు.  ‘గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు అనూహ్య స్పందన వస్తోంది. నిన్న ఒక్కరోజే 1.34లక్షల మందికిపైగా, మొత్తంగా ఈరోజు సాయంత్రం వరకు 4.67 లక్షల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించాను. పరీక్షలకు హాజరవుతున్న వారందరికీ ఆల్‌ ద బెస్ట్’ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top