కృష్ణా వరదలపై సీఎం జగన్‌ సమీక్ష

వరదల పరిస్థితిపై నివేదికలు సమర్పించిన సీఎంఓ అధికారులు

సాయం అందించడంలో అలసత్వం వదన్న వైఎస్‌ జగన్‌

వాషింగ్టన్‌ డీసీ నుంచి డల్లాస్‌ వెళ్లనున్న ముఖ్యమంత్రి

 వాషింగ్టన్‌ డీసీ: అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణానది వరదలపై సమీక్ష నిర్వహించారు. సీఎంఓ అధికారులు పంపించిన నివేదికలను ఆయన పరిశీలించారు. ఎగువనుంచి వస్తున్న వరద నీరు, విడుదల చేస్తున్న జలాలపై ఆరా తీశారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై సమీక్ష చేశారు. బాధితులకు సహాయం అందించడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించొద్దని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసికట్టుగా పనిచేస్తున్నారని, బాధితులకు సహాయం చేస్తున్నారని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. వరద సహాయ కార్యక్రమాలు చురుగ్గా, వేగంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రికి సీఎంఓ అధికారులు వివరించారు.

Back to Top