నూతన ఇసుక పాలసీపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

అమరావతిః నూతన ఇసుక పాలసీ రూపకల్పనపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇసుక పాలసీపై ఇప్పటికే పలుమార్లు  మంత్రుల బృందం చర్చలు జరిపారు. రాష్ట్రం ప్రభుత్వం ఇసుకకు సంబంధించి పారదర్శకమైన విధానాన్ని అవలంబించాలని యోచిస్తోంది.ఇసుక మాఫియాను అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై దృష్టి పెట్టనున్నారు. లబ్ధిదారులను ఇసుకను ప్రభుత్వమే సరాఫరా చేసేవిధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇసుక పాలసీ విధానంలో ఎలా ముందుకెళ్ళాలనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇసుక ధరలను ఎంత  నిర్ణయించాలనే దానిపై కూడా సమీక్షించనున్నారు.  తెలంగాణలో అమలు అవుతున్న ఇసుక పాలసీనే ఏపీలో కూడా అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

ఇసుక కావాలనుకునే లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే నేరుగా ఇంటికే ఇసుకను సరాఫరా చేసే పాలసీ తెలంగాణలో అమలులో ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఇసుక ధరలు ఎలా ఉన్నాయి..దీనికి సంబంధించి ఎలాంటి విధానాలు అవలంబించానే దానిపై సమీక్ష జరుపుతున్నారు.గత ప్రభుత్వంలో ఇసుకరీచ్‌లను అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు దోచుకున్నారు. దోపిడీకి చెక్‌ పెడుతూ పారదర్శకంగా,తక్కువ ధరకే  లబ్ధిదారుడికి ఇసుక అందించానే దిశగా  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ముందడుగు వేస్తున్నారు. ఈ సమావేశంలో ఐదు శాఖలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Back to Top