విద్యార్థులకు కరెంట్‌ షాక్‌ ఘటనపై సీఎం వైయ‌స్ జగన్‌ దిగ్భ్రాంతి

మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం 

గాయపడిన వారికి కూడా రూ.లక్ష చొప్పున.. 

 తాడేప‌ల్లి: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతుకుర్రు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై యడ్ల నవీన్‌ (7) అనే మూడో తరగతి విద్యార్థి మృత్యువాత పడ్డాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో చిట్టిమేను వివేక్‌ (3వ తరగతి), తిరుపతి ఘన సతీష్‌కుమార్‌ (4వ తరగతి)లను అత్యవసర వైద్యం నిమిత్తం అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.  
విద్యార్థులకు కరెంట్‌ షాక్‌ ఘటనపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన బాలుడి కుటుంబానికి శుక్రవారం ఆయన రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని సూచించారు.  

Back to Top