మహానేత వైయస్‌ఆర్‌కు కుటుంబ సభ్యుల నివాళి

పులివెందుల: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్‌కు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, వైయస్‌ షర్మిల్, వైయస్‌ భారతి, వైవీ సుబ్బారెడ్డి మహానేతకు నివాళులర్పించారు. అనంతరం మహానేత విగ్రహానికి పూలమాలలు వేశారు. వారితో పాటు వైయస్‌ఆర్‌ నాయకులు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌డ్డి, వైయస్‌ఆర్‌ అభిమానులు నివాళులర్పించారు. 

 

Back to Top