వరద నష్టం అంచనాలు లెక్కించండి 

అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం
 

  విజయవాడ : వరదల కారణంగా నష్టపోయిన బాధితులను గుర్తించాలని, పూర్తి స్థాయిలో నష్టం అంచనాలు లెక్కించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన నష్ట నివేదికలు ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. భారీ వరదలతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించింది. దీంతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం గణనీయంగా తగ్గింది.  ముంపు ప్రాంతాల్లో వరదలు తగ్గుముఖం పట్టాయి. పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, స్వచ్ఛంద సంస్థల సేవలు కొనసాగుతున్నాయి. భారీ వరదల నేపథ్యంలో ప్రకాశం నుంచి ఇప్పటివరకు 300 టీఎంసీల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు.  

Back to Top