సీఎం వైయ‌స్ జగన్‌ మదనపల్లె పర్యటన వాయిదా 

మదనపల్లె: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మదనపల్లె పర్యటన వాయిదా పడిందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌బాషా ప్రకటించారు. మిథున్‌రెడ్డి, నవాజ్‌బాషా మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ 25వ తేదీన సీఎం వైయ‌స్ జగన్‌ మదనపల్లెలో పర్యటించాల్సి ఉందని చెప్పారు.

 బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని, ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు, భద్రతా కారణాల వల్ల సీఎం పర్యటన వాయిదా పడినట్లు వివరించారు. తిరిగి ముఖ్యమంత్రి పర్యటన ఈ  నెల 29 లేదా 30న ఉండవచ్చని, సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాక అధికారికంగా ప్రకటిస్తామన్నారు.    

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top