రేపు గుమ్మళ్లదొడ్డిలో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన..  

 రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో ఇండస్ట్రియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఇథనాల్‌) పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం అధికారిక పర్యటన షెడ్యూల్‌ విడుదలైంది. 
శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 9.35కు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌ బయలుదేరి 10.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10.40 గంటలకు అస్సాగో ఇండస్ట్రియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారు.

10.45 నుంచి 11.40 గంటల వరకు శంకుస్థాపన, బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సభా వేదిక నుంచి 11.45 బయలుదేరి రోడ్డు మార్గంలో 11.50 గుమ్మళ్లదొడ్డి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 1.10 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకుంటారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top