ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ 

 శ్రీసత్యసాయి జిల్లా: మేమంతా సిద్ధం బస్సుయాత్ర ద్వారా కదిరి ప‌ట్ట‌ణానికి వ‌చ్చిన  ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి..ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. ముస్లిం  సోద‌రుల‌తో క‌లిసి ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో పాల్గొని వారితో క‌లిసి విందు చేశారు.    వైయస్‌.జగన్ సమక్షంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌ బాషా వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  

అడ్వాన్స్‌డ్‌ ఈద్‌ ముబారక్‌..
అందరికీ మేలు జరగాలని, ముస్లిం సోదరులందరికీ ముందస్తుగా రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు (అడ్వాన్స్‌డ్‌ ఈద్‌ ముబారక్‌) తెలిపారు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి.  ఇప్తార్ విందులోముస్లిం సోదరులతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆప్యాయంగా మాట్లాడారు. విందులో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రి ఉషశ్రీచరణ్, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, జఖియా­ఖానమ్, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ మంత్రి షాకీర్, మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా, కదిరి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీఎస్‌ మక్బుల్, సీనియర్‌ నేతలు వజ్రభాస్కర్‌రెడ్డి, పూల శ్రీనివాసరెడ్డి, పెద్దసంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. 

Back to Top