పార్వతీ ప్రసాద్ మృతి పట్ల సీఎం వైయస్‌ జగన్‌ సంతాపం

 తాడేపల్లి : ఆకాశవాణి న్యూస్‌ రీడర్‌ పింగళి పార్వతీ ప్రసాద్‌(70) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆకాశవాణి, దూరదర్శన్ లో ఆమె సేవలు నిరుపమానమని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. కాగా, కొన్ని రోజులగా అనారోగ్యంతో బాధపడుతున్న పార్వతి ప్రసాద్ ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో క‌న్నుమూశారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top