అమరావతి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో విజయం సాధించిన అమ్మాయిలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం ట్విటర్ ద్వారా అభినందనలు తెలియజేశారు. ‘‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో అద్భుత విజయాలు సాధించినందుకు ఛాంపియన్‌లు రజిత, పల్లవి, శిరీషలకు అభినందనలు. ఉక్కు సంకల్పం కలిగిన ఈ అమ్మాయిలు ఏపీకి గర్వకారణంగా నిలిచారు. వీళ్ల విజయం.. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన పటిమ, కలలను సాధనకు చేసిన కృషి.. ఎంతో మంది ఔత్సాహికులకు ప్రేరణ అంటూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.