పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు 

 ఏపీలో ఆహారశుద్ధి పరిశ్రమలను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

7 ప్రాజెక్టులకు భూమిపూజతో పాటు మరో 6 ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం

13 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో రూ.2,851 కోట్ల పెట్టుబడులు

పరిశ్రమల ఏర్పాటు ద్వారా 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి

పరిశ్రమల ఏర్పాటు ద్వారా 90,700 మంది రైతులకు లబ్ధి

 తాడేప‌ల్లి:  రాష్ట్రంలో ఏర్పాట‌వుతున్న ప‌రిశ్ర‌మ‌ల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు ద‌క్కుతాయ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.  ఏపీలో ఆహారశుద్ధి, పరిశ్రమలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. 7 ప్రాజెక్టులకు భూమిపూజతోపాటు మరో 6 ప్రాజెక్టులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంల నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఎం  వైయ‌స్ జగన్‌ మాట్లాడుతూ.. మొత్తం  13 ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో రూ. 2,851 కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు.  13 జిల్లాల్లో ఏర్పాటైన పరిశ్రమలతో  6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కుతాయని తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు ఎప్పుడు ప్రభుత్వం అందుబాటులో ఉంటుందని, అన్ని రకాలుగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అందరూ అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని సీఎం చెప్పారు.  

 
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో రూ.557 కోట్ల పెట్టుబడులకు సంబంధించి సీఎం వైయ‌స్ జగన్ చేతుల మీదుగా భూమి పూజ, ఉత్పత్తి ప్రారంభం, ఒప్పందాలు కార్యక్రమం జరిగాయి. వీటి ద్వారా 2,405 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుండగా.. పరోక్షం 90,700 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ.65 కోట్లతో 13 మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్మాణ పనులను వైయ‌స్‌ జగన్ ప్రారంభించారు. తిరుపతి జిల్లా కంచరపాలెం దగ్గర రూ.168 కోట్లతో ఏటా 40,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన డీపీ చాక్లెట్స్‌ యూనిట్‌ను వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు.

 
అనంతపురం జిల్లా డి.హీరేహళ్‌లో రూ.544 కోట్లతో ఎకో స్టీల్‌ ఇండియా, బాపట్ల జిల్లా కొరిసిపాడు దగ్గర శ్రావణి బయో ఫ్యూయల్‌ రూ.225 కోట్లు, తిరుపతిలోని నాయుడుపేటలో 800 కోట్ల రూపాయలతో గ్రీన్‌లామ్‌ సౌత్, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 200 కోట్ల రూపాయలతో నాగార్జునా ఆగ్రో కెమికల్స్, తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి దగ్గర 150 కోట్ల రూపాయలతో రవళి స్పిన్నర్స్, శ్రీసత్యసాయి జిల్లా గూడుపల్లి దగ్గర 125 కోట్ల రూపాయలతో యునైటెడ్‌ ఇండస్ట్రీస్‌ ఆటో ప్లాస్టిక్, మడకశిర వద్ద 250 కోట్ల రూపాయలతో ఎవరెస్ట్‌ స్టీల్‌ బిల్డింగ్‌ యూనిట్ల నిర్మాణ పనులను సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి క్యాంపు కార్యాల‌యం నుంచి వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు.

Back to Top