కైలాసగిరిపై అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు

విశాఖపట్నం: విశాఖ ప్రజల ఘన స్వాగతం అందుకున్న సీఎం వైయస్‌ జగన్‌ కైలాసగిరి చేరుకున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) చేపట్టే రూ.379.82 కోట్ల పనులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ శంకుస్థాపనలు చేశారు. కైలాసగిరిలో ప్లానిటోరియం ఏర్పాటు కోసం రూ. 37 కోట్లు, కాపులుప్పాడలో బయో మైనింగ్‌ ప్రాసెసింగ్‌కు రూ. 22.5 కోట్లు, లా కాలేజీ నుంచి బీచ్‌ రోడ్డు వరకు 80 ఫీట్ల రోడ్డు విస్తరణకు రూ. 7.5 కోట్లు, బీచ్‌ రోడ్డులో పర్యాటక కాంప్లెక్స్, మ్యూజియంకు రూ. 40 కోట్లు, చుక్కవానిపాలెంలో 60 ఫీట్ల మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డుకు రూ. 90 కోట్లు, సిరిపురం జంక్షన్‌లో మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్, వాణిజ్య సముదాయం కోసం రూ. 80 కోట్లు, నేచురల్‌ హిస్టరీ పార్క్, మ్యూజియం రీ సెర్చ్‌ సంస్థకు రూ. 88 కోట్లు, ఐటీ సెజ్‌ నుంచి బీచ్‌ రోడ్డు నిర్మాణం కోసం రూ. 75 కోట్లతో సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపనలు చేశారు. 
 

Back to Top