అట్ట‌హాసంగా సీఎం క‌ప్ క్రీడ‌లు ప్రారంభం

పోటీల‌ను ప్రారంభించిన ఎంపీ మ‌ద్దిల గురుమూర్తి  

తిరుపతి: సీఎం కప్ క్రీడాలు తిరుప‌తి న‌గ‌రంలో అట్ట‌హాసంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఎంపీ మద్దిల గురుమూర్తి   మంగళవారం తిరుప‌తి న‌గ‌రంలోని నెహ్రు మునిసిపల్ హైస్కూలు లో గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించి, క్రీడాకారుల‌ను ప‌రిచ‌యం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రియతమ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ్మ ఒడి, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో నాడు నేడు, గోరుముద్ద వంటి పథకాలు తీసుకొచ్చార‌ని తెలిపారు. జగనన్న ఆశయాలు ముందుకు తీసుకెళ్లే విధంగా విద్యార్థులు బాగా చదువుకుని క్రీడల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని.. అందుకు వారి తల్లిదండ్రులు కూడా సహకరించాలని  పేర్కొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడమే గాక వ్యక్తిత్వాన్ని పెంపోందిస్తాయని చెప్పారు.ప్రభుత్వ పెద్దలతో చర్చించి క్రీడాకారుల అభివృద్దికి తోడ్పాటును అందిస్తాం అని స్పష్టం చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top