తాడేపల్లి: గ్రామీణ నేపధ్యం ఉట్టిపడేలా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి, గ్రామ సచివాలయం వద్ద పంచాగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం అందించిన తిరుమల తిరుపతి దేవస్ధానం పండితులు. ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి దంపతులకు ఆహ్వానం పలికిన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, సాంస్కృతిక, పర్యాటకశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణీమోహన్, ఇతర అధికారులు. ప్రత్యేక వేదిక వద్ద ఏర్పాటు చేసిన దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం. ఉగాది వేడుకల ప్రత్యేక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయం వేదికపై పంచాంగ శ్రవణం. గ్రామీణ నేపధ్యం ఉట్టిపడేలా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు.ఉగాది వేడుకలకు హాజరైన చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి దంపతులు. పంచాంగాన్ని ఆవిష్కరించి, రాష్ట్ర ప్రభుత్వ ఆస్ధాన సిద్ధాంతి శ్రీ కప్పగంటి సుబ్బరామసోమయాజులకు అందజేసిన సీఎం శ్రీ వైయస్.జగన్. వేదికపై పంచాంగ శ్రవణం నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ఆస్ధాన సిద్ధాంతి శ్రీ కప్పగంటి సుబ్బరామసోమయాజులు. ఉగాది వేడులను స్వయంగా పర్యవేక్షించిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ముఖ్యమంత్రి వైయస్.జగన్, శ్రీమతి భారతి దంపతులకు ఉగాది పచ్చడి అందించిన ఆస్ధాన సిద్ధాంతి సుబ్బరామసోమయాజులు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్ధాన సిద్ధాంతి శ్రీ కప్పగంటి సుబ్బరామ సోమయాజులును సత్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్. పంచాంగ శ్రవణం అనంతరం ముఖ్యమంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్ధప్రసాదాలు అందించిన టీటీడీ వేదపండితులు, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానం స్ధానాచార్యులు, అర్చకులు, వేదపండితులు. సమాచార శాఖ రూపొందించిన ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ను ముఖ్యమంత్రికి అందించిన సమాచారశాఖ కమిషనర్ తుమ్మ విజయ్‌కుమార్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్. వ్యవసాయపంచాంగం 2022–23, ఉద్యానవన పంచాంగం 2022–23లను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్. సాంస్కృతికశాఖ రూపొందించిన శిల్పారామం క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు జయశ్రీ రచించిన *ఆమెకు తోడుగా న్యాయదేవత* పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్, శ్రీమతి భారతి దంపతులు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు: ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...: శుభకృతనామ ఉగాది సంవత్సరంలోకి ఈరోజు అడుగుపెడుతున్నాం. దేవుడి దయ వలన పంచాంగాలన్నీ కూడా నామములోనే శుభం అన్న మాట కనిపిస్తుంది. ఈ సంవత్సరం అంతా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభం జరుగుతుందని చెపుతున్న నేపధ్యంలో... దేవుడి దయ, ప్రజలందరి చల్లనిదీవెనలు మనందరి ప్రభుత్వానికి ఇంకా బలాన్నివ్వాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, మిత్రులే కాకుండా ... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు, ప్రతి తాతకు, అవ్వకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని సీఎం తన ప్రసంగం ముగించారు. అనంతరం... అధికార భాషా సంఘం అధ్యక్షులు పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన తెలుగు సాహిత్యం,సమాజం చరిత్ర– రెండువేల సంవత్సరాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్. రాష్ట్రంలో వివిధ దేవస్ధానాలకు చెందిన వేదపండితులను సత్కరించిన సీఎం శ్రీ వైయస్.జగన్, శ్రీమతి వైయస్.భారతి దంపతులు. కార్యక్రమంలో నవరత్నాలు నృత్యరూపకాన్ని ప్రదర్శించిన చిన్నారులు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్. మల్లిఖార్జునరావు రూపొందించిన డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చిత్రపటాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. ఐఏఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి సీఎం శ్రీ వైయస్.జగన్‌కు విరాళంగా చెక్ అందజేసిన ఐఏఎస్ అధికారుల సతీమణులు. ఉగాది వేడుకలకు హాజరైన ఉపముఖ్యమంత్రి(ఎక్సైజ్‌శాఖ) కె నారాయణస్వామి, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ సలహాదారు(ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు(కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్ పలువురు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.