వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ రెడ్డప్పకు అస్వస్థత 

పుంగనూరు: పార్లమెంట్‌ సమావేశాల్లో ఉన్నవైయ‌స్ఆర్‌సీపీ  చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం గుండెపో టు రావడంతో ఆయన్ను ఢిల్లీలోని ఫోర్టీస్‌ హాస్పిటల్లో చేర్పించారు. వైద్యులు పరీక్షలు చేసి పేస్‌మేకర్‌ను అమర్చారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. రెండుమూడు రోజుల్లో ఆపరేషన్‌ చేయనున్నట్టు ఆయన కుమార్తె డాక్టర్‌ హిమబిందు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే కుమార్తెతో పాటు, భార్య రెడ్డెమ్మ, అల్లుడు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.   
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top