వైయ‌స్ఆర్‌సీపీలోకి వ‌ల‌స‌ల వెల్లువ‌

వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన ప‌లువురు

చిత్తూరు జిల్లా నుంచి భారీ చేరికలు

మంగ‌ళ‌గిరి నుంచి ప‌లువురు కార్పొరేట‌ర్లు చేరిక‌

 హైదరాబాద్‌ :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో  వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి  సమక్షంలో శుక్రవారం టీడీపీ నేతలు వైయ‌స్ఆర్‌సీపీ లో చేరారు. వీరందరికీ వైయ‌స్‌ జగన్.. కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

మాజీ ఎంపీ మిథున్‌ రెడ్డి సమక్షంలో చిత్తూరు బీసీ సంక్షేమ సంఘం నేత బులెట్‌ సురేష్‌, టీడీపీ టౌన్‌ ప్రెసిడెంట్‌ మాపక్షి మోహన్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ భాస్కర్‌, టీడీపీ కార్పొరేటర్లు నవీన ఇందు, శ్రీకాంత్, సహదేవన్‌, చంద్రయ్య, డేవిడ్‌, ముత్తయ్య, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు వేలంగాని, ఎంపీటీసీ రాధమ్మ, ఇండిపెండెంట్‌ కార్పొరేటర్‌ లతా శ్రీధర్‌ తదితరులు పార్టీలో చేరారు.

మరోవైపు మంగళగిరికి చెందిన పలువురు నేతలు కూడా శుక్రవారం వైయ‌స్ జగన్ సమక్షంలోవైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. పార్టీలో చేరినవారిలో మంగళగిరి కౌన్సిలర్‌ ఉడత శ్రీను, మునగపాటి వెంకటేశ్వరరావు, వంగర శంకుతల, బి.నరసింహారావు, షేక్‌ అక్రమ్‌, ఎం.బాబురావు, డీ.శ్రీనివాస్‌, కె.లక్ష్మణ్‌ రావు తదితరులు ఉన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top