టీడీపీ కావాలనే సభను అడ్డుకునే ప్రయత్నం

చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి
 

అమరావతి: స్పీకర్‌ చైర్‌ను అగౌరవపరిచేలా టీడీపీ వ్యవహరిస్తుందని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. చారిత్రాత్మక బిల్లులపై చర్చ జరుగుతుంటే టీడీపీ కావాలనే అడ్డుపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ మైకులను లాగేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. స్పీకర్‌ సూచనలను టీడీపీ సభ్యులు పట్టించుకోవడం లేదన్నారు. అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు  అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడులను సస్పెండ్‌ చేయడం సరైన నిర్ణయమే అని, సభ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. 
 

తాజా ఫోటోలు

Back to Top