దేశంలోనే రోల్‌మోడల్‌గా సీఎం వైయస్‌ జగన్‌ పాలన

కోవిడ్‌ సమయంలో ఆర్థిక ఇబ్బందులున్నా.. సంక్షేమ పథకాల అమలు ఆగలేదు

విద్యా, వైద్యం, రైతు, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు

ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం సీఎం వైయస్‌ జగన్‌కే సొంతం

డీబీటీ, నాన్‌డీబీటీ ద్వారా పేదలకు దాదాపు రూ.1.75 లక్షల కోట్లు అందించారు

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసింది

ఫ్లైఓవర్‌ కట్టలేని చంద్రబాబు.. రాష్ట్ర రాజధాని ఎలా నిర్మిస్తాడో ఆలోచించాలి

అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

అసెంబ్లీ: గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని,  టీడీపీ దిగిపోయేనాటికి రూ.80 వేల కోట్ల బకాయిలు, దాదాపు రూ.3 లక్షలకోట్లకు పైగా అప్పులు చేసిందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి గుర్తుచేశారు. టీడీపీ గెజిట్‌ పేపర్‌ ఈనాడులో రాష్ట్ర ఖజానాలో రూ.100 కోట్లు కూడా లేవనే వార్త అందరం చూశామన్నారు. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైయస్‌ జగన్‌.. పాదయాత్రలో గమనించిన ప్రజల కష్టాలను తీర్చాలని, ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలని, పథకాలు స్వయంగా పేదల ఇంటికి చేరాలని దేశంలోనే రోల్‌ మోడల్‌గా సీఎం వైయస్‌ జగన్‌ తన పాలన కొనసాగిస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. 

శాసనసభలో చీఫ్‌ విప్‌ గడికోట ఇంకా ఏం మాట్లాడారంటే..
సభలో గవర్నర్‌ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష సభ్యులు దారుణంగా వ్యవహరించారు. వారి తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. కరోనా పరిస్థితులు రెండేళ్లు ఉన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో స్టేట్‌ గ్రోత్‌ 16.82 శాతం ఉండటం సంతోషం. పర్‌క్యాపిటా ఇన్‌కం 1,76,707 నుంచి 2,04,758కి చేరడం ఆనందంగా ఉందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ కరోనా సమయంలో సంక్షేమ పథకాలు అమలు చేయకపోయి ఉండుంటే పరిస్థితి ఘోరంగా ఉండేది. వలసలు విపరీతంగా పెరిగేవి. మిగిలిన రాష్ట్రాల్లో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు విసత్కర పరిస్థితుల్లో సంతోసంగా జీవించారు. 

దేశంలోనూ సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న పథకాలపై చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన తరువాత 1995లో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసి 2004 వరకు పరిపాలన చేశాడు. 2004లో చంద్రబాబు గద్దె దిగేవరకు రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడా చూసినా కరువు, పేదలు పూరి గుడిసెల్లో జీవించారు. దివంగతమహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రం మలుపుతిరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో పేదలను ఎలా ఆదుకోవాలనే ఆలోచన వైయస్‌ఆర్‌ నుంచే ప్రారంభమైంది. జీవన విధానాలు మారాయి. వైయస్‌ఆర్‌ హయాంలో గ్రామాలకు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి, ఎక్కడా పూరి గుడిసె లేకుండా చేశారు. అందుకే 2009లో అన్ని పార్టీలు ఒకటైనా సింగిల్‌గా పోరాడి ప్రజాభిమానం పొందారు. ఆయన మరణంతో రాష్ట్రంలోని సంక్షేమం, అభివృద్ధి కుంటుపడ్డాయి. 

రాష్ట్రం విడిపోవడానికి కూడా చంద్రబాబే కారణమయ్యాడు. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టి.. అన్ని గ్రాఫిక్స్‌ చూపించి రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడేశాడు. కనకదుర్గ దుర్గ వారధి కూడా పూర్తి చేయలేకపోయాడు. ఒక ఫ్లైఓవర్‌ను కట్టలేని వ్యక్తి రాష్ట్ర రాజధాని ఏ విధంగా నిర్మిస్తాడో ఆలోచన చేసుకోవాలి. మీడియాతో గొప్పలు చెప్పించుకుంటూ జీవిస్తున్నాడు. 

పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం వైయస్‌ జగన్‌ పాలన సాగుతోంది. జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, వైయస్‌ఆర్‌ రైతు భరోసా, వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ, వైయస్‌ఆర్‌ ఫ్రీక్రాప్‌ ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ, మత్స్యకార భరోసా, వైయస్‌ఆర్‌ వాహన మిత్ర, వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక, వైయస్‌ఆర్‌ చేయూత, వైయస్‌ఆర్‌ ఆసరా, వైయస్‌ఆర్‌ బీమా, వైయస్‌ఆర్‌ కాపునేస్తం, వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం, వైయస్‌ఆర్‌ లా నేస్తం, జగనన్న చేదోడు, ఆరోగ్యశ్రీ ఆసరా, ఎంఎస్‌ఎంఈ రీస్టార్ట్, అగ్రిగోల్డ్‌.. ఇలా అన్నీ చేసుకుంటూ అర్చకులు, ఇమామ్, మౌజన్, పాస్టర్లకు గౌరవ వేతనం, రేషన్‌ కార్డు కలిగిన వారికి కరోనా సాయం.. డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్‌ డెబిట్‌లో పేదలకు దాదాపు రూ.లక్షా 75 వేల కోట్లు నేరుగా చేర్చిన మహా నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. 

ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా.. ఎటువంటి ఆటంకాలు, పైరవీలు లేకుండా డైరెక్ట్‌గా ప్రజల చెంతకు సంక్షేమ సాయం అందించారు. సీఎం వైయస్‌ జగన్‌ పేదల గురించి ఆలోచన చేస్తున్నారు. విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నాడు–నేడుతో మొదటి విడత కింద 15 వేలస్కూళ్లకు పైగా ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్‌కు దీటుగా తయారు చేశారు. రెండు, మూడు విడతల్లో మిగిలిన పాఠశాలలను కూడా ఆధునీకరిస్తారు. పిల్లలకు బెల్ట్, బ్యాగ్, డిక్షనరీ, యూనిఫాం క్లాత్, నోట్‌బుక్స్, టెక్ట్స్‌ బుక్స్, షూ అందిస్తున్నారు. 

కొంతమంది సినిమాల్లో ఇంగ్లిష్‌ మీడియం పెడతామంటే చప్పట్లు కొడతారు.. ఇక్కడ ఇంగ్లిష్‌ మీడియం పెడతామంటే ఏడుస్తున్నారు. అదేంటో అర్థం కావడం లేదు. పేదలు ఇంగ్లిష్‌ మీడియం చదవకుండా ఆటంకాలు సృష్టించిన పార్టీ టీడీపీ. చంద్రబాబు ఏ రోజూ రాష్ట్ర మంచి గురించి ఆలోచన చేయలేదు. దేశంలో ఏ రాష్ట్రం ఖర్చుపెట్టనంత బడ్జెట్‌ను ఏపీలో విద్యకు ఖర్చుపెడుతున్నారు. 

పేదవారికి కావాల్సింది విద్య, వైద్యం. ఆరోగ్యరంగంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చారు. కరోనా లాంటి పరిస్థితుల్లో దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు చేశారు. వ్యాక్సినేషన్‌లో దేశంలోనే ఏపీ ఆదర్శంగా నిలిచింది. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీలు అందరూ కలిసి 96 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేశారు. ప్రతి హాస్పిటల్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్లు, బెడ్స్‌ ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రశంసనీయం. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన 104, 108లకు సీఎం వైయస్‌ జగన్‌ జీవం పోశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని టీడీపీ నిర్వీర్యం చేసింది.. అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీని బలపరుస్తూ వేల వ్యాధులను జత చేసి.. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడుతున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. 

ప్రతి స్కూల్‌లో కంటివెలుగు కార్యక్రమాన్ని పెట్టారు. కంటివెలుగు ద్వారా 67 లక్షల మందికి పరీక్షలు చేశారు. దాదాపు 1.60 లక్షల మందికి కంటి అద్దాలు, 395 మందికి సర్జరీలు చేశారు. 60 సంవత్సరాలు దాటిన అవ్వాతాతలకు కంటివెలుగు పథకం ద్వారా 18.5 లక్షల మందికి టెస్టులు చేసి 9 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేశారు. 3 లక్షల మందికి క్యాట్రాక్స్‌ సర్జరీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి పెన్షన్లు అందజేస్తున్నారు. 

దేశంలోనే నంబర్‌ వన్‌ ముఖ్యమంత్రి అని వైయస్‌ జగన్‌కు స్కోచ్‌ సంస్థ అవార్డు ప్రకటించింది. వ్యవసాయానికి రైతు భరోసా కింద రెండున్నరేళ్లలో రూ.20,117 కోట్లు రైతులకు చెల్లించాం. ప్రకృతి వైపరీత్యాల నిధి కింద రూ. 2 వేలు కోట్లు, ధరల స్థిరీకరణ కింద రూ.3 వేల కోట్లు నిధి ఏర్పాటు చేసింది. సున్నావడ్డీని పునరుద్ధరించారు. దాదాపు 10,778 ఆర్బీకేలు నిర్మిస్తున్నాం. పంట నష్టం వచ్చిన సీజన్‌లోనే ఇన్‌పుట్‌ సబ్సిడీని చెల్లిస్తున్నాం. రైతులకు పగటిపూట 9 గంటల కరెంట్‌ ఇచ్చిన ప్రభుత్వం మాది. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పగటిపూట విద్యుత్‌ ఇస్తున్నాం. పెన్షన్లకు ప్రతీ నెలా రూ.16 వందల కోట్లు వెచ్చిస్తున్నాం. 62 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నాం. 

మేనిఫెస్టోను దగ్గర పెట్టుకొని తిరుగుతున్నాం. గత ప్రభుత్వం వారి మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచే మాయం చేసింది. ప్రజలకు చెప్పిన మాట నిలబెట్టుకునే తత్వం సీఎం వైయస్‌ జగన్‌కే సొంతం. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో ఇప్పటికే 96 శాతం అమలు చేశాం. సీఎం వైయస్‌ జగన్‌ను దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top