రాష్ట్రంలో టీడీపీది అరాచక పాత్ర

ప్రజలు తిరస్కరించిన చంద్రబాబుకు బుద్ది రాలేదు

ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేసి చూపించాం

చంద్రబాబు ప్రతిపక్ష పాత్రలో కూడా వైఫల్యం

చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేశారు

ప్రభుత్వానికి పేరు వస్తుందని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు

టీడీపీ హయాంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

తాడేపల్లి: చంద్రబాబును ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించినా బుద్ధి రాలేదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ అరాచక పాత్ర పోషిస్తుందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల సమయంలో, ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని చెప్పారు.  ఆటో కార్మికుల ఆర్థికసాయంపై టీడీపీ సిగ్గులేని ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ  కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో ఆయన  మాట్లాడారు.

అందరికి నవరాత్రి శుభాకాంక్షలు. టీడీపీ ప్రతిపక్ష పాత్ర పోషించకుండ అరాచక పాత్ర పోషిస్తుందని మండిపడ్డారు. గత ఎన్నికల్లో టీడీపీని ప్రజలు తిరస్కరించినా చంద్రబాబులో మార్పు రాలేదు. ప్రతిపక్ష పాత్రలో టీడీపీ ఘోరవైఫల్యం చెందింది. 2014లో చంద్రబాబు సీఎం అయిన తరువాత చేసిన మొదటి ఐదు సంతకాలకు దిక్కే లేదు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి తూచా తప్పకుండా హామీలు అమలు చేస్తున్నారు. ఓర్వలేక టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మేనిఫెస్టో అమలు ఎన్నికలకు ముందు చేస్తారని, కానీ వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన గంటలోపే ఆ హామీలు అమలు చేయడం మొదలు పెట్టింది. రివర్స్‌టెండరింగ్‌కు చట్టం చేసి ఒక టెండరింగ్ లోనే రూ.850 కోట్లు ఆదా చేస్తే..ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ..విమర్శలు చేస్తున్నారు. దేవుడు కనికరించి మంచి వర్షాలు కురిపిస్తే..రైతులు సంతోషంగా ఉన్నారు. దీన్ని కూడా ఓర్వలేకపోతున్నారు. వరద నీటితో తన ఇంటిని ముంచుతున్నారని నీచ రాజకీయాలు చేశారు. కోడెల శివప్రసాదరావు తన వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా రాజకీయం చేశారు. వదరల సమయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్షిస్తూ ప్రజలకు తోడుగా ఉంటే..చంద్రబాబు ఫెయిడ్‌ ఆర్టీస్టులతో డ్రామాలాడించారు. వైయస్‌ జగన్‌ చేస్తున్న పాలన చూసి ఓర్వలేక రోజు రోజుకు విఫరీత వైఖరీతో వెళ్తున్నారు. మే 14, 2018న వైయస్‌ జగన్‌ ఏలూరులో సొంత ఆటోలు, ట్యాక్సీలు ఉన్న డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు ఇస్తామని మాట ఇచ్చి నెరవేర్చారు. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. 

రైతుల కోసం మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక అడుగు వేస్తే..వైయస్‌ జగన్‌ రెండు అడుగులు వేశారు. ప్రతి రైతుకు రూ.12,500 పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పారు. చంద్రబాబు రైతులను, అక్కాచెల్లెమ్మలను రుణమాఫీ పేరుతో మోసం చేశారు. మా నాయకుడు చెప్పినట్లుగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చిరస్థాయిగా నిలిచిపోయారు. 43 వేల బెల్టు షాపులు మూసివేయించారు. 20 శాతం మద్యం దుకాణాలను రద్దు చేశారు. అక్టోబర్‌ 2న మద్యం అమ్మారని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. చేస్తున్న పనులను ప్రజలకు వివరించలేక టీడీపీ నేతలు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు.
యువతను చంద్రబాబు మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని చంద్రబాబు ఇవాళ మాట్లాడటం సిగ్గుచేటు. సచివాలయ ఉద్యోగాలు పారదర్శకంగా నిర్వహిస్తే అభినందించాల్సింది పోయి పేపర్‌ లీకేజీ అంటూ అబద్ధాలు చెబుతారా? ఇంతగా ప్రజలను మభ్యపెడుతారా? రూ.5 వేల కోట్ల భారం పడుతున్నా కూడా వైయస్‌ జగన్‌ ఏమాత్రం తగ్గకుండా ప్రజలకు మేలు చేసే ఆలోచనలో వెళ్తున్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని చంద్రబాబు గంటల తరబడి మాట్లాడుతున్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్‌టీఆర్‌ను ఎంతగా వేధించారు. లక్ష్మీపార్వతిపై మీరు చేసిన అరాచకాలు తెలియవా? జూనియర్‌ ఎన్టీఆర్‌ను కూడా వదల్లేదు.

వైయస్‌ఆర్‌ కుటుంబంపై సోషల్‌ మీడియాలో ఎలాంటి తప్పుడు ప్రచారం చేశారో ప్రజలకు తెలియదా? రాష్ట్రానికి మద్దతుగా ఉండాల్సిన మీరు..పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయని అసత్యాలు చెబుతున్నారు. పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లను జేబుల్లో పెట్టుకొని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతాన్ని అల్లకొల్లొలం చేసేందుకు ప్రయత్నించారు. టీడీపీ పాలనలో ఎంపీ మిథున్‌రెడ్డిపై అనవసరంగా కేసు నమోదు చేసి వేధించారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు కళ్లు తెరిచి, వాస్తవాలు తెలుసుకోవాలని, ఏ అంశంపైనైనా కూడా చర్చకు మేం సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారు. మా ఎమ్మెల్యేలు విడదల రజినీ, టీజేఆర్‌ సుధాకర్‌బాబు మీకు సవాలు విసిరారని, దమ్ముంటే చర్చకు రావాలని సూచించారు. ప్రతిపక్ష పాత్ర పోషించాలని, లేదంటే ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా తిరస్కరిస్తారని హెచ్చరించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేదల కోసం నాలుగు అడుగులు వేస్తున్నారని, వైయస్‌ఆర్‌ కంటి వెలుగు, అమ్మ ఒడి, రైతు భరోసా వంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని, వైయస్‌ జగన్‌ ఒక స్పష్టమైన విజన్‌తో ముందుకు వెళ్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top