ప్రజలకు న్యాయం జరిగే విధంగా రాజధాని నిర్మాణం

 చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి 

చంద్రబాబు దుర్మార్గాల వల్లే ప్రపంచ బ్యాంకు రుణాన్ని తిరస్కరించింది

చంద్రబాబు భయాందోళనకు గురి చేస్తున్నారని రైతుల నుంచి  ఫిర్యాదులు  

అమరావతి:  ప్రజలకు న్యాయం జరిగే విధంగా రాజధాని నిర్మాణం చేపడుతామని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు రుణాన్ని తిరస్కరించినందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన వెల్లడించారు. రాజధాని భూములపై గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రపంచ బ్యాంకు నివేదికను చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి బయటపెట్టారు.
శుక్ర‌వారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శ్రీ‌కాంత్‌రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు దుర్మార్గాల వల్లే ప్రపంచ బ్యాంకు రుణాన్ని తిరస్కరించిందన్నారు. గత ప్రభుత్వం రాజధాని ల్యాండ్‌ ఫూలింగ్‌లో చట్టాన్ని విస్మరించిందని చెప్పారు. రైతులను భయాందోళనకు గురి చేశారని మండిపడ్డారు. ల్యాండ్‌ ఫూలింగ్‌ యాక్ట్‌ను దుర్వినియోగం చేశారని రైతులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

కౌలు రైతులు, రైతులను చంద్రబాబు భయాందోళనకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వడం లేదని, దళితుల భూములను కాజేస్తున్నారని ఫిర్యాదులో రైతులు పేర్కొన్నట్లు శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. అక్రమంగా నివాసం ఉంటున్న ఇంటిపైనే చంద్బరాబు స్పష్టత ఇవ్వట్లేదని దుయ్యబట్టారు. 

 

తాజా ఫోటోలు

Back to Top