ప్రతీ విద్యార్థిని చెయ్యి పట్టి నడిపిస్తున్నాం

ప్రైమరీ నుంచి హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరకు అనేక సంస్కరణలకు శ్రీకారం

విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం

మన పిల్లలు పెద్ద చదువులు చదవాలి.. ఉద్యోగాలు చేయాలి

ఉన్నత చదువులతోనే పేదరికం నుంచి బయటపడగలం

కరికుళం రూపురేఖలు మార్పు.. జాబ్‌ ఓరియంటెడ్‌గా తీర్చిదిద్దుతున్నాం

మన పిల్లల స్కిల్స్‌ను డెవలప్‌ చేసే విధంగా అడుగులు వేశాం

మైక్రోసాఫ్ట్‌ ద్వారా శిక్షణ పొంది సర్టిఫికెట్లు అందుకున్న విద్యార్థులకు ఆల్‌ ది బెస్ట్‌

ఏయూ కాన్వోకేషన్‌ హాల్‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతీ విద్యార్థి చదువుకోవాలి.. చదువుతోనే ∙పేదరికం నుంచి బయటపడగలం అన్న తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తూ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా మన పిల్లలు కరికుళం ఏం చదువుతున్నారు. ఆ కరికుళం జాబ్‌ ఓరియంటెడ్‌గా ఉందా.. లేదా..? అని చూసి మార్పులు తీసుకురావాలనే తపన, తాపత్రయంతో ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రతీ ఒక్కరూ ఆలోచన చేసి అడుగులు ముందుకువేస్తున్న పరిస్థితి మొట్టమొదటి సారిగా ఆంధ్రరాష్ట్రంలో జరుగుతుందన్నారు. విశాఖ ఏయూ కాన్వొకేషన్‌ హాల్‌లో మైక్రోసాఫ్ట్‌ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత కార్యక్రమానికి సీఎం వైయస్‌ జగన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..
‘‘ఆంధ్రరాష్ట్రంలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) మారాలి. 18 నుంచి 23 సంవత్సరాల వరకు ఎంతమంది పిల్లలు కాలేజీల్లో అడ్మీషన్‌ తీసుకుంటున్నారని గమనిస్తే.. బ్రిక్స్‌ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ అమెరికా) దేశాలతో కంప్యార్‌ చేసినప్పుడు విచిత్రమైన నంబర్లు కనిపిస్తాయి. మన భారతదేశంలో ఆ నంబర్లు 26, 27 శాతం మాత్రమే నమోదవుతున్నట్టు కనిపిస్తున్నాయి. మిగిలిన వారు ఎందుకు చదువుకోవడం లేదు.. ఎందుకు కాలేజీల్లో చేరడం లేదని గమనిస్తే.. కారణం ఏంటంటే.. ఆర్థిక ఇబ్బందులతో చదువులు మానేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి ప్రతీ అంశాన్ని బూతద్దంలో చూసి.. వాటిని అధిగమించడానికి ప్రతీ అడుగుపడుతుంది. 

ఇంగ్లిష్‌ మీడియం లేకపోతే పిల్లల భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో ప్రాథమిక పాఠశాల నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాం. పిల్లలను బడికి పంపించే పరిస్థితి కోసం అమ్మఒడి అనే పథకాన్ని తీసుకువచ్చాం. బడుల్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోతే పిల్లలు స్కూళ్లకు వెళ్లి ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో మెరుగైన వసతులు కల్పించేందుకు మనబడి నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు అడుగులు వేశాం. పిల్లలను బడికి పంపించేందుకు స్కూల్‌ డ్రెస్, టెక్స్‌›్ట బుక్స్, నోట్‌ బుక్స్‌ కోసం తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదని విద్యా కానుక ద్వారా పిల్లలకు అండగా, తోడుగా నిలబడ్డాం. స్కూళ్లలో మిడ్‌డే మిల్స్‌లో క్వాలిటీ పెంచితేనే పిల్లలకు సంబంధించి మేధస్సు పెరుగుతుందని గోరుముద్ద దగ్గర నుంచి ప్రతీ అడుగూ ప్రైమరీ స్కూల్‌ నుంచి హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరకు ప్రతీ దశలోనూ పిల్లలను చెయ్యి పట్టి నడిపించే అడుగులు వేశాం. 

ఇంటర్మీడియట్‌ అపోయిన తరువాత ప్రతీ పిల్లాడు కూడా పెద్ద చదువులు చదువుకోవాలి.. చదువుతోనే పిల్లల జీవితాలు బాగుపడతాయని విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు తీసుకువచ్చాం. విద్యా దీవెనలో డిలే లేకుండా.. ప్రతీ త్రైమాసికం అయిపోయిన వెంటనే తల్లుల అకౌంట్‌లోకి విద్యా దీవెన నగదు ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నాం. క్రమం తప్పకుండా సంవత్సరానికి రెండు దఫాలుగా పిల్లలకు మంచి జరగాలని వసతి దీవెనతో సపోర్టు చేస్తున్నాం. 

ఇవన్నీ చేస్తూనే.. కరికుళంలో రూపురేఖలు మార్చే గొప్ప కార్యక్రమం జరుగుతుంది. మొట్టమొదటి సారిగా చదువుకున్న  డిగ్రీకి జాబ్‌ ఓరియంటెడ్‌గా అడుగులు వేసే కార్యక్రమం కొనసాగుతంది. పిల్లల చదువులతో పాటు స్కిల్స్‌కు సంబంధించిన అవసరాలను గుర్తించి వారి స్కిల్స్‌ను డెవలప్‌ చేసే విధంగా అడుగులు పడుతున్నాయి. ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ డెవలప్‌ చేయడం, ఆన్‌లైన్‌ స్కిల్స్‌ ద్వారా సెల్ఫ్‌ సర్టిఫికేషన్స్‌ను కూడా క్రెడిట్‌ ట్రాన్స్‌ఫర్స్‌లో భాగంగా పెట్టడం, ప్రతీ స్టూడెంట్‌కు ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరిగా తీసుకురావడం, కరికుళం కూడా జాబ్‌ ఓరియంటెడ్‌గా తీర్చిదిద్దడం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామో ఆలోచన చేయాలని కోరుతున్నాను. 

ఈ రోజు మైక్రోసాఫ్ట్‌ ద్వారా దాదాపుగా 36 వేల మంది పిల్లలకు మైక్రోసాఫ్ట్‌ సర్టిఫికేషన్‌ వచ్చి.. దాని ద్వారా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇంకా మెరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలందరికీ మనస్ఫూర్తిగా మంచి జరగాలని, దేవుడు మంచి చేసే అవకాశం ఇంకా ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఆల్‌ ది వెరీ బెస్ట్‌ విషెస్‌’’ చెబుతూ సీఎం వైయస జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top