కంగాటి వంశీధ‌ర్‌రెడ్డిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

క‌ర్నూలు: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌ర్నూలు చేరుకున్నారు. క‌డ‌ప నుంచి ప్ర‌త్యేక విమానంలో బ‌య‌ల్దేరిన సీఎం ఓర్వ‌క‌ల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్క‌డి నుంచి హెలికాప్ట‌ర్‌లో క‌ర్నూలులోని ఏపీఎస్‌పీ బెటాలియ‌న్‌లోని హెలిపాడ్‌కు చేరుకున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేత‌లు, అధికారులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. 

ఏపీఎస్‌పీ బెటాలియ‌న్ నుంచి రోడ్డు మార్గాన ప‌త్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీ‌దేవి నివాసానికి ముఖ్య‌మంత్రి చేరుకున్నారు. అనంత‌రం వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కంగాటి ప్రదీప్‌ కుమార్‌రెడ్డి కుమారుడు వంశీధర్‌రెడ్డి వివాహ కార్యక్రమానికి హాజరైన సీఎం వైయస్ జగన్‌.. వరుడు వంశీధర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి,  ఆశీర్వదించారు. 

Back to Top