రేపు విశాఖ‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ఈనెల 27న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖలో పర్యటించనున్నారు. మిలాన్‌–2022 యుద్ధనౌకల సమాహారంలో భాగంగా నిర్వహించే ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు ఆదివారం మ‌ధ్యాహ్నం సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ తాడేప‌ల్లి నుంచి విశాఖ బ‌య‌ల్దేర‌నున్నారు. విశాఖ చేరుకున్న అనంత‌రం నావల్‌ డాక్‌యార్డ్‌లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఐఎన్‌ఎస్‌ వేలా సబ్‌మెరైన్‌ సందర్శిస్తారు. అక్కడి నుంచి ప్రభుత్వ సర్క్యూట్‌ హౌస్‌కు వెళ్తారు. సాయంత్రం ఆర్‌కే బీచ్‌కు చేరుకుని ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ మిలాన్‌–2022లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. కార్య‌క్ర‌మం అనంత‌రం విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి గన్నవరం బయల్దేరుతారు. 

తాజా వీడియోలు

Back to Top