పల్నాడు: మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ... సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలిపారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ, వంటి సత్కార్యాల ద్వారా అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్, రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ... సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి అన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని, అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.