కేసీఆర్‌కు సీఎం వైయస్‌ జగన్‌ శుభాకాంక్షలు

తాడేపల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఏపీ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌కు విషెస్‌ చెబుతూ సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రజాసేవలో చిరకాలం కొనసాగేలా దీవించాలని ప్రార్థిస్తున్నాను’ అని సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 
 

Back to Top