కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవం అరుదైన ఘట్టం

సీజేఐ ఎన్వీ రమణ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషం

న్యాయవ్యవస్థకు సహాయ, సహకారాలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఎల్ల‌ప్పుడూ సిద్ధం

కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

విజయవాడ: జ్యుడీషియల్‌కు అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విజయవాడలో సిటీ సివిల్‌ కోర్టు బిల్డింగ్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. ముందుగా కోర్టు బిల్డింగ్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన భారతదేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, హైకోర్టు సీజే ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులకు సీఎం వైయస్‌ జగన్‌ అభినందనలు తెలిపారు. 

అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. సీజేఐ ఎన్వీ రమణ చేతుల మీదుగా విజయవాడలో కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, ఇదొక అరుదైన ఘట్టమన్నారు. చాలా చోట్ల కోర్టు కాంప్లెక్స్‌లు నిర్మిస్తుంటారని, కానీ.. జస్టిస్‌ ఎన్వీ రమణ చేతుల మీదుగా ప్రారంభించడం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. ఇదే కోర్టు కాంప్లెక్స్‌ 2013లో జస్టిస్‌ ఎన్వీ రమణ చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగిందని, మళ్లీ ఈరోజు ఆయన చేతుల మీదుగా ప్రారంభించుకోవడం దేవుడి విధి అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జ్యుడిషియల్‌కు సంబంధించి ప్రతీ విషయంలో అన్ని రకాలుగా సహకరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం  సిద్ధంగా ఉంటుందని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top