48 గంటల్లో నాణ్యమైన ఎరువులు అందించాలి

2018 రబీ బీమా సొమ్ము రూ.596 కోట్లు జూన్‌ 26న చెల్లిస్తాం

వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన 2018 రబీకి సంబంధించిన రూ.596 కోట్ల బీమా సొమ్మును జూన్‌ 26న చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. దీని ద్వారా దాదాపు 5 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయం శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతులు ఆర్డర్‌ ఇచ్చిన 48 గంటల్లో నాణ్యమైన ఎరువులు డెలివరీ చేయాలని అధికారులను ఆదేశించారు. పంటలు కొనుగోలు చేయాలన్నా.. ఇనుఫుట్‌ సబ్సిడీ ఇవ్వాలన్నా.. బీమా, పంట రుణాలు ఇవ్వాలన్నా ఈ–క్రాపింగ్‌ చాలా ముఖ్యమన్నారు. అగ్రికల్చర్, రెవెన్యూ అసిస్టెంట్లు దీన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. హార్టికల్చర్, ఫిషరీస్‌ కూడా ఈ–క్రాపింగ్‌లో నమోదు కావాలని అధికారులను ఆదేశించారు.
 

Back to Top