నేడు అవుకుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

ఎమ్మెల్సీ చల్లా భగీరధ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్న ముఖ్య‌మంత్రి

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం నంద్యాల జిల్లా అవుకుకు వెళ్ల‌నున్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చ‌ల్లా భ‌గీర‌థ‌రెడ్డి నిన్న క‌న్నుమూశారు. దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరధ రెడ్డి అంత్యక్రియల్లో  ముఖ్య‌మంత్రి పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం, 3.35 గంటలకు నంద్యాల జిల్లా అవుకు చేరుకుంటారు. 3.50 – 4.30 వరకు దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరధ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనకు నివాళి అర్పించి అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.35 గంటలకు అవుకు నుంచి బయలుదేరి 6.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top