చ‌ల్లా భ‌గీర‌థ‌రెడ్డి అకాల మ‌ర‌ణం ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి

భ‌గీరథ‌రెడ్డి కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతి తెలిపిన ముఖ్య‌మంత్రి

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి అకాల మ‌ర‌ణం ప‌ట్ల ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. కొంతకాలంగా ఆయన న్యుమోనియాతో బాధపడుతూ.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. భ‌గీర‌థ‌రెడ్డి అకాల మ‌ర‌ణం ప‌ట్ల‌ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అవుకు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన భగీరథ చురుకైన నాయకుడని, ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు.  ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ త‌న‌ సానుభూతిని తెలియజేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top