సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి

తాడేప‌ల్లి: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ మేర‌కు సీఎం వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు. గౌతమ్‌రెడ్డి తనకు తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువ నాయకుడని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఈ విషాద ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ, తన యువ మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనన్నారు. భారమైన హృదయంతో ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top