ఊరూరా వైయస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు

సేవా కార్యక్రమాలు చేపట్టండి

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి 

అమరావతి: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతిని సెప్టెంబర్‌ రెండో తేదీన  ఊరూరా ఘనంగా నిర్వహించాలని వైయస్‌ఆర్‌సీపీ తన శ్రేణులకు పిలుపు నిచ్చింది. ఆ రోజున సేవా కార్యక్రమాలు నిర్వహించి మహానేతకు నివాళులు అర్పించాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. 
అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని స్థాయిలలో వైయస్‌ఆర్‌ జ్ఞాపకాలను ప్రజలు స్మరించుకునేలా ఉదయం 9 గంటలకు నివాళులు అర్పించిన అనంతరం అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాలలో పండ్లు, దుస్తుల పంపిణీతో పాటు రక్తదాన శిబిరాలు, అన్నదానం వంటి  కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు.  

Back to Top